- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత ఆర్థిక వ్యవస్థను మోడీ శక్తివంతం చేశారు: పవన్ కల్యాణ్
భారత్ అమెరికా ట్రేడ్ డీల్ లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టారిఫ్ లు 25శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటిచింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టారిఫ్ లు 25శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటిచింది. అదనపు సుంకాల తొలగింపును వైట్ హౌస్ ధృవీకరించింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి మోడీ అంగీకరించారని ట్రంప్ చెప్పంగా ఇకపై భారత్ అమెరికా, వెనెజులా నుండి చమురు కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న ప్రధాని మోడీ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా సుంకాలు 18శాతం తగ్గించడం రైతులకు గొప్ప వరం అని ఎక్స్ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారం వ్యవధిలో రెండు ప్రపంచ స్థాయి వానిజ్య ఒప్పందాలను ముగించడం ద్వారా భారతదేశం ఆర్థిక వ్యవస్థను మోడీ శక్తివంతం చేశారని కొనియాడారు. సుంకాలు 18 శాతానికి తగ్గించడం వల్ల మార్కెట్ యాక్సెస్ మరియు ఎగుమతి పోటీతత్వం మెరుగుపడటం ద్వారా రైతులకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.






