- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PAWAN KALYAN: అధిక మద్యం ధరలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్
అధిక ధరలకు మద్యం విక్రయించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి.

X
దిశ, వెబ్ డెస్క్: అధిక ధరలకు మద్యం విక్రయించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి.. ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని చెప్పారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
భారత ఆర్థిక వ్యవస్థను మోడీ శక్తివంతం చేశారు: పవన్ కల్యాణ్
Next Story






