- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Girl: ఇండియా వాలో కబీతో ఆవో పాకిస్తాన్! పాక్ టిక్ టాక్ స్టార్ సనాను కాల్చి చంపిన దుండగుడు
ఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అనేక రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల (India-Pakistan) భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అనేక రీల్స్ (Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్- పాక్ మధ్య యుద్ధం జరుగుతోందని, పాకిస్తాన్‌కు వాటర్ బంద్ పెడితే మేము ఎలా బతకాలంటూ చాలా వీడియోలు వైరల్‌గా నిలిచాయి. పాకిస్తాన్‌లో కూడా మంచి వారు ఉంటారని ‘ఇండియా వాలో కబీతో ఆవో పాకిస్తాన్’ అంటూ చాలా (Reels) రీల్స్ వైరల్ అయ్యాయి. అందులో భాగంగా (Pakistan) పాకిస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సనా యూసఫ్ (Pakistani TikTok star Sana Yousaf) వీడియోలు భారత్‌లో తెగ వైరల్ అయ్యేవి. ఇకపై ఆ యువతి చెందిన కొత్త వీడియోలు మనకు కనిపించక పోవచ్చు. ఎందుకంటే క్యూట్‌గా మాట్లాడే ఆ యువతి మృతి చెందినట్లు పాకిస్తాన్ మీడియా దృవీకరించింది.
వివరాల్లోకి వెళితే.. టిక్‌టాక్ స్టార్ సనా యూసఫ్ సోమవారం (Islamabad) ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో కాల్చి చంపబడ్డారని మీడియా నివేదికలు తెలిపాయి. ఈ సంఘటన సుంబల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సనా ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగుడు ఆమెపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి, ఆ తర్వాత పారిపోయాడని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. హంతకుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ ఘటనకు కారకులైన వారిని ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్‌కు చెందిన సనా యూసఫ్, తన టిక్‌టాక్ కంటెంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. అదేవిధంగా మహిళా హక్కులు, చిత్రాల్ సంస్కృతిపై వీడియోల ద్వారా సనా పాపులర్ అయింది. యువతి హత్యకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మరడంతో ఆ ఫాలోవర్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. తన హత్యకు కారణమైన వారికి అరెస్ట్ చేయాలని, సనాకు న్యాయం చేయాలని ఫాలోవర్లు డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా, పాకిస్తాన్ టిక్ టాక్ స్టార్స్ హత్యలు కొత్త కానట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో క్వెట్టాలో హీరా అనే 15 ఏళ్ల టీనేజర్‌ను టిక్ టాక్ వీడియోలు చేయోద్దని హెచ్చరించిన కూడా రీల్స్ చేస్తోందని తన తండ్రి, మామ కలిసి హత్య చేసినట్లు కలకలం రేపింది. పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో టీనేజ్ యువతులు టిక్‌టాక్ రీల్స్ చేయడం తమ పరువుకు భంగం వాటిల్లినట్లు కుటుంబ సభ్యులు భావిస్తారని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో తరచూ జరుగుతున్న పరువు హత్యల కోణంలో సనా హత్యకేసును పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.






