- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి.. ఏడాదిన్నరగా కుటుంబానికి దూరం.. ఏం జరిగింది?

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ నటి హుమైరా అస్ఘర్ అలీ (Humaira Asghar Ali) విషయంలో విషాదకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. కరాచీ (Karachi)లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె శవమై కనిపించిన సంఘటనకు తొమ్మిది నెలల క్రితమే మృతి చెందిందన్న అంచనాలు వెలుబడ్డాయి. కరాచీలోని అద్దె ఇంట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఆమె శరీరం ఉండటంతో.. చాలా నెలల క్రితమే మరణించిందని ప్రాథమికంగా నిర్థారించారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. హుమైరా సుమారు తొమ్మిది నెలల క్రితం మరణించిదని అధికారులు తెలిపారు.
ఇంటి యజమాని ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి
లాహోర్ వాసి అయిన హుమైరా.. ఏడేళ్ల కిందట కరాచీకి వచ్చి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివసించేది. గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆహారం పాడైపోయింది, కొన్ని వస్తువులు తుప్పుపట్టాయి, విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసినట్లుగా అధికారులు తెలిపారు. పక్క ఫ్లాట్ ఖాళీగా ఉండటం, అంత సేపు ఎవరు సందర్శించకపోవడంతో మృతదేహం నుంచి వచ్చే వాసనను ఎవరూ గుర్తించలేకపోయారు. ఫిబ్రవరిలో కొంతమంది ఆ అంతస్తుకు వచ్చినప్పటికీ అప్పటికే నెలలు గడిచిన స్థితిలో ఉండటంతో వాసనగా అనిపించలేదని పోలీసులు తెలిపారు.
మృతదేహం గుర్తించిన మూడు రోజుల తర్వాతే ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. మొదట ఎవరూ దాన్ని స్వీకరించేందుకు ముందుకురాలేదు. చివరకు ఆమె సోదరుడు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హుమైరా గత ఏడాదిన్నరగా ఇంటికి వెళ్లలేదట. హుమైరా అస్ఘర్ అలీ 2015లో పాకిస్తాన్ ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. పలు టీవీ షోలతో పాటు, జలేబీ (2015), లవ్ వ్యాక్సిన్ (2021) వంటి సినిమాల్లో నటించారు. 2022లో వచ్చిన తమాషా రియాల్టీ షోతో మరింత గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె మృతి వెనక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హుమైరా మృతి పాక్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.






