- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. పాకిస్థాన్ ప్రధాని కీలక ప్రకటన
ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్ న్యూస్: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు దాడులు చేస్తున్నాయి. అయితే ఈ దాడులకు కౌంటర్ గా ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని దేశాలను టార్గెట్ చేసింది ఇరాన్. ఈ తరుణంలో పచ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు అలర్ట్ అయ్యాయి. ఇండియన్ సిటిజన్స్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారతీయ రాయబార కార్యాలయాలు పేర్కొన్నాయి. అయితే ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది.
ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టారు. అబుదాబీలో జరిగిన దాడుల్లో పాకిస్తాన్ పౌరుడు మరణించడం విషాదకరమని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు. ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ ఆరా తీసినట్లు వైట్ హౌస్ ప్రకటన చేసింది.






