ఆఫ్ఘన్ ప్రాక్సీ యుద్ధం వెనుక భారత్ హస్తం: పాకిస్తాన్ మంత్రి మరోసారి సంచలన ఆరోపణలు

by Ramesh Naini |   (  Updated:2025-10-17 10:53:25  IST  )

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆఫ్ఘన్ ప్రాక్సీ యుద్ధం వెనుక భారత్ హస్తం: పాకిస్తాన్ మంత్రి మరోసారి సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ (Pakistan) రక్షణ మంత్రి మరోసారి భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణలపై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ అంతర్జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. సరిహద్దుల్లో భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చని భావించారు.

తమపై ఆఫ్ఘనిస్తాన్ ప్రాక్సీ యుద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. తాలిబన్ల నిర్ణయాల వెనుక ‘ఢిల్లీ స్పాన్సర్‌షిప్’ ఉందని వ్యాఖ్యనించారు. ఆఫ్ఘన్ ప్రాక్సీ యుద్ధం వెనుక భారత్ హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. భారత్‌ సరిహద్దులో డర్టీ గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో రెండువైపులా యుద్ధానికి పాక్ సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయని, యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేమని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Next Story