Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలపై దేశాలపై ట్రావెల్ బ్యాన్

by Shamantha N |   (  Updated:2025-03-15 15:06:37  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, భూటాన్ సహా 41 దేశాలపై ప్రయాణ నిషేధం విధించడానికి రెడీ అయ్యారు.

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలపై దేశాలపై ట్రావెల్ బ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, భూటాన్ సహా 41 దేశాలపై ప్రయాణ నిషేధం విధించడానికి రెడీ అయ్యారు. ఆయా దేశాల పౌరులకు విస్తృత ప్రయాణ ఆంక్షలు జారీ చేయడాన్ని ట్రంప్ పరిపాలన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిషేధంలో మొత్తం 41 దేశాలను మూడు ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. తొలి పది దేశాలను రెడ్ లిస్ట్ లో ఉంచారు. అఫ్గాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా సహా 10 దేశాల పౌరులకు వీసా సస్పెన్షన్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అంటే, ఆయా దేశాలకు వీసాలు నిలిపివేస్తారు.

జాబితాలో మార్పులు ఉండే ఛాన్స్

రెండో గ్రూపులో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్‌తో సహా ఐదు దేశాలు పాక్షిక సస్పెన్షన్‌లను ఎదుర్కొంటాయి. ఇవి పర్యాటక, విద్యార్థి వీసాలతో పాటు ఇతర వలస వీసాలపై ప్రభావం చూపనున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మూడో గ్రూపులో పాకిస్థాన్, భూటాన్, మయన్మార్‌తో సహా మొత్తం 26 దేశాలున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు 60 రోజుల్లోపు లోపాలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయకపోతే వీసా జారీలు పాక్షికంగా నిలిపివేయనున్నారు. అయితే, జాబితాలో మార్పులు ఉండవచ్చని, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇంకా దీనికి ఆమోదం తెలపలేదని సమాచారం. జాతీయ భద్రతా ముప్పులను గుర్తించడానికి అమెరికాలోకి ప్రవేశం కోరుకునే విదేశీయులందరికీ భద్రతా తనిఖీని తీవ్రతరం చేయాలని ట్రంప్ జనవరి 20న కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు.

Also Read..

Starmer: పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలి.. గ్లోబర్ లీడర్స్‌కు బ్రిటన్ పీఎం స్టార్మర్ విజ్ఞప్తి

Donald Trump: ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉంది

Next Story