Starmer: పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలి.. గ్లోబర్ లీడర్స్‌కు బ్రిటన్ పీఎం స్టార్మర్ విజ్ఞప్తి

by B.Srinivas |   (  Updated:2025-03-15 15:02:51  IST  )

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Starmer: పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలి.. గ్లోబర్ లీడర్స్‌కు బ్రిటన్ పీఎం స్టార్మర్ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చొరవతో రష్యా (Russia) ఉక్రెయిన్ (Ukrein) మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ (Keer starmer) కీలక సూచన చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Puthin) పై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు. పుతిన్ త్వరలోనే దీనిపై చర్చలకు రావాలని తెలిపారు. లండన్‌లో జరుగుతున్న ‘కోలియేషన్ ఆఫ్ ద విల్లింగ్’ అనే సమావేశంలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి సైనిక, ఆర్థిక సహాయం చేయడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.

పుతిన్ శాంతి ప్రణాళికను తేలికగా తీసుకోకూడదని, గ్లోబల్ లీడర్స్ ఈ విషయంలో నిబద్దతను పాటించాలని చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత మద్దతు అందించడం, దాని భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకునేలా యూరోపియన్ దేశాలను ప్రేరేపించడం తమ లక్ష్యమని తెలిపారు. దీనికి గాను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. యూరోపియన్ భాగస్వాములు, ఉక్రెయిన్‌తో సహా దాదాపు 25 దేశాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో అమెరికా నుంచి ప్రతినిధులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

కాగా, ఉక్రెయిన్‌లో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం మద్దతిచ్చారు. కానీ ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించలేదు. దీనికి గాను ఆయన కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే స్టార్మర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read..

Donald Trump: ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉంది

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలపై దేశాలపై ట్రావెల్ బ్యాన్

Next Story