శ్రీలంకలో ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నింధితులు.?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-03 11:40:55  IST  )

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నింధితులు నిన్నటి వ‌ర‌కు క‌శ్మీర్‌లోనే ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వారు చెన్నై నుండి శ్రీలంకలోని బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

శ్రీలంకలో ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నింధితులు.?
X

దిశ, వెబ్ డెస్క్: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నింధితులు నిన్నటి వ‌ర‌కు క‌శ్మీర్‌లోనే ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వారు చెన్నై నుండి శ్రీలంకలోని బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చెన్నై నుండి శ్రీలంక వెళ్లిన ఫ్లైట్‌లో ఆరుగురు అనుమానితులు ఉన్నట్టు భారత్ నుండి అక్కడి అధికారులకు సమాచారం అందించారు. దీంతో బండారనాయకే విమానాశ్రయాన్ని అక్కడి పోలీసులు ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్నారు. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విమానాశ్రయంతో పాటూ శ్రీలంకలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. వాటిలోనూ తనిఖీలు చేపడుతున్నారు.

Next Story