- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పుల మోత.. 93 మంది హత్య.. పదుల సంఖ్యలో గాయాలు
గాజాలో మరోసారి జనసమూహంపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 93 మంది పాలస్తీనియన్లు మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం.. గాజా సిటీ సమీపంలో ఫుడ్ ట్రక్కులు రాగా ఆహారం కోసం వెళ్లారు జనాలు. ఈ క్రమంలోనే కాల్చి

దిశ, వెబ్ డెస్క్ : గాజాలో మరోసారి జనసమూహంపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 93 మంది పాలస్తీనియన్లు మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం.. గాజా సిటీ సమీపంలో ఫుడ్ ట్రక్కులు రాగా ఆహారం కోసం వెళ్లారు జనాలు. ఈ క్రమంలోనే కాల్చి చంపబడ్డారు. రఫాహ్‌లోని ఒక సహాయ కేంద్రం వద్ద తొమ్మిది మంది.. ఖాన్ యూనిస్‌లో మరో సైట్ వద్ద నలుగురు మరణించారు. ఐక్యరాష్ట్ర సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (UN World Food Programme) తమ 25 ట్రక్కుల కాన్వాయ్ గాజా సిటీ సమీపంలో కాల్పులను ఎదుర్కొందని ధృవీకరించింది.
సాక్షులు, ట్యాంకులు, స్నిపర్లు జనసమూహంపై కాల్పులు జరపడం.. జంతువుల వేటలా ఉందని వర్ణించారు. ఇజ్రాయెల్ సైన్యం ఈ ఘటనను ఖండించింది. సైనికులు తక్షణ బెదిరింపును ఎదుర్కోవడానికి హెచ్చరిక కాల్పులు జరిపినట్లు పేర్కొంది. పౌరులకు హాని కలగకుండా చూస్తామని.. ఇలాంటి సంఘటనల తర్వాత కొత్త సైనిక సూచనలు జారీ చేశామని తెలిపింది. కాగా మే చివరి నుంచి ఇప్పటి వరకు సహాయం కోసం వచ్చినవారిలో దాదాపు 800 మంది మరణించినట్లు నివేదించింది ఐక్యరాష్ట్ర సమితి.






