ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

by Shamantha N |

ఇండియాలో భవిష్యత్తులో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియాలో భవిష్యత్తులో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. శనివారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇంకా మద్దతు ఇస్తూ ఉంటే వారు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదన్నారు.

ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేశాం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2016లో సర్జికల్ స్ట్రైక్ చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ లో కూడా పాక్ లోని ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి ధ్వంసం చేశామని చెప్పారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత్ భీకర దాడులు చేయడంతో వణికిపోయిన పాక్ ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలని భారత్ ను వేడుకుంది. అప్పటికే పాక్ లోని 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడంతో పాటు ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. చివరకు పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.

Next Story