ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. లక్ష కోట్ల రక్షణ ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఆమోదం

by Shamantha N |

ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలిచే పరిణామంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) శుక్రవారం రూ.1.05 లక్షల కోట్ల విలువైన 10 రక్షణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..  లక్ష కోట్ల రక్షణ ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలిచే పరిణామంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) శుక్రవారం రూ.1.05 లక్షల కోట్ల విలువైన 10 రక్షణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోత్రివిధ దళాల అవసరాల కోసం ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ICIMS), ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణుల (QRSAM) కొనుగోలుకు అవసరమైన ఆమోదం (Acceptance of Necessity – AoN) తెలిపారు. ఇది పాకిస్తాన్‌తో శత్రుత్వ ఉద్రిక్తతల తర్వాత జరిగిన మొదటి (DAC) సమావేశం కావడం గమనార్హం. భారత దళాలు ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్లో పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో అత్యాధునిక ఆధునిక ఆయుధాలను వినియోగించాయి.

సాయుధ దళాల పటిష్ఠం

ఈ అభివృద్ధితో, భారత రక్షణ శాఖ తమ సాయుధ దళాలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా, స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) వ్యవస్థలు, పాకిస్తాన్ సరిహద్దులో భారత వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో మూర్డ్ మైన్స్, మైన్ కౌంటర్ మెజర్ వెస్సల్స్, సూపర్ రాపిడ్ గన్ మౌంట్స్, సబ్ మెర్సిబుల్ అటానమస్ వెస్సల్స్ వంటి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. వీటిన్నింటిని భారతదేశ స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి అభివృద్ధి చేస్తున్నారు.

నాణ్యతా, ఆయుధ వ్యవస్థల ఆధిక్యత

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత దళాలు విస్తృతంగా స్వదేశీ ఆయుధాలను ఉపయోగించాయి. ఇందులో (DRDO) అభివృద్ధి చేసిన ఆకాష్ క్షిపణి వ్యవస్థ, వైమానిక రక్షణ వ్యవస్థ వంటి ఆధునిక ఆయుధాలే కాక, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులకు వినియోగించారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనా తయారీ HQ-9 సిస్టమ్ ఆకాష్ క్షిపణుల్ని అడ్డుకోడంలో విఫలమవడం, భారత ఆయుధ వ్యవస్థల నాణ్యతను ఆధిక్యతను స్పష్టంగా చూపించింది. ఈ పరిణామాలు, భారత రక్షణ రంగాన్ని స్వావలంబంగా మార్చే దిశగా ఒక పెద్ద ముందడుగు అని భావిస్తున్నారు.


Next Story