Operation Sindhur : ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: పాక్ రక్షణశాఖ 20 శాతం నిధులు పెంపు

by Shamantha N |

పాకిస్థాన్ ఆ దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్‌ మునీర్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Operation Sindhur : ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్:  పాక్ రక్షణశాఖ 20 శాతం నిధులు పెంపు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఆ దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్‌ మునీర్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్ లో 9 బిలియన్ డాలర్లను రక్షణశాఖకు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా నిధులతో మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేయనుంది. 2022లో పాక్ లో వరదల కారణంగా 3.3 కోట్ల మంది వరద ప్రభావిత బాధితులు ఉన్నారు. దాదాపు ఆ సమయంలో ఏకంగా 15 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు పేర్కొన్నాయి. వీటిని మెరుగుపరిచేందుకు మొగ్గు చూపలేదు. ఇంత జరిగినా కూడా పాకిస్థాన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకే మొగ్గు చూపుతోంది.

ఆర్థిక, ఆహార సంక్షోభం పక్కన పెట్టి..

ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం వాటిని మెరుగుపరిచేందుకు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవాలి. ఇస్లామాబాద్‌ వినియోగించిన హెచ్‌క్యూ-9 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, బైరక్తర్‌ టీబీ2 డ్రోన్లు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. దీంతో రావల్పిండి సమీపంలోని నూర్‌ఖాన్‌ సహా పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. జే-35 స్టెల్త్‌ జెట్‌లకు చైనా 50శాతం డిస్కౌంట్‌పై పాక్ కు అమ్ముతోంది. 400 కిలోమీటర్ల రేంజి ఉన్న పీఎల్07 క్షిపణులు, కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద పాక్ ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని పక్కన పెట్టి ఆయుధ సంపత్తి పెంచుకునేందుకు మొగ్గు చూపడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story