- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ వైపు పెళ్లికి నో ఇంట్రెస్ట్.. మరోవైపు పెరుగుతున్న విడాకులు
ఏ దేశంలో అయినా.. ఏ సంప్రదాయంలో అయినా.. పెళ్లికి ఇచ్చే విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: ఏ దేశంలో అయినా.. ఏ సంప్రదాయంలో అయినా.. పెళ్లికి ఇచ్చే విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే.. పెళ్లి నూరేళ్ల పంట అని అంటారు పెద్దలు. అయితే, నేటి తరం యువత చాలా మంది పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చటం లేదు. పైగా పెళ్లి చేసుకున్న వారిలో కూడా ఎక్కువగా విడాకులు తీసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఇక ఈ విషయంలో చైనా ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఇప్పటికే జనాభా సంక్షోభంతో (Population Crisis) తీవ్ర అవస్థలు పడుతున్న చైనాకు ఇది మరో తలనొప్పిగా మారింది.
తగ్గిన పెళ్లిళ్లు..
చైనాలో వివాహాలు భారీ స్థాయిలో తగ్గిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని తీవ్ర కలవరపెడుతోంది. దీని ఫలితంగా డ్రాగన్ కంట్రీలో జననాల రేటు తగ్గి, వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గతేడాది మొత్తంగా 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదుకాగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20.5 శాతం తగ్గినట్లు ఆ దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివాహాల రిజిస్ట్రేషన్ మొదలుపెట్టిన 1986 నుంచి ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. 2013లో 1.3 కోట్ల వివాహాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య సగానికంటే తక్కువగా నమోదైంది. ఈక్రమంలో చైనాలో తగ్గిపోతున్న జనాభాను పరిష్కరించడానికి, అక్కడి ప్రభుత్వం వివాహాలను, పిల్లలను కనడాన్ని ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడూ అనేక రాయితీలు ప్రకటిస్తున్నప్పటికీ.. అక్కడి యువత మాత్రం పెళ్లిళ్లు అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు.
పెరిగిన విడాకులు..
మరోవైపు ఇదే సమయంలో చైనాలో విడాకుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. గతేడాది 26 లక్షల జంటలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28 వేలు అధికమని గణాంకాలు చెబుతున్నాయి. వీటి సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టిన చైనా ప్రభుత్వం.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 30 రోజుల 'కూలింగ్-ఆఫ్' వ్యవధిని తప్పనిసరి చేసింది. అయితే 2021 నుంచి దీనిని అమలు చేస్తున్నప్పటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనాలో గతేడాది శ్రామిక జనాభా (16-59) 68.3లక్షలు తగ్గినట్లు తాజా నివేదిక పేర్కొంది. చైనా మొత్తం జనాభాలో దాదాపుగా 30 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. ఇది అమెరికా జనాభాకు సమానం. జనాభా తగ్గుదలకు వివాహల సంఖ్య తగ్గిపోవడమూ ఓ కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది చైనా అధికారులు కాలేజ్‌లు, స్కూళ్లలో వివాహం, ప్రేమ, సంతానోత్పత్తి, కుటుంబ వ్యవస్థని ప్రోత్సహించడానికి 'లవ్ ఎడ్యుకేషన్'ని ప్రవేశపెట్టారు.






