హర్మూజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

by velandi.Saikiran |

ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి.

హర్మూజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటన చేసింది. ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు సంబంధించిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి, $89.26 కు చేరుకుంది. అటు అమెరికాకు సంబంధించిన WTI క్రూడ్ 10.45 డాలర్లు తగ్గి..$84.24 కు బ్యారెల్ ధర తగ్గింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి.. $93.46 కు చేరుకుంది. యుద్ధంతో ఓ దశలో 150 డాలర్లకు చేరుతుందని అనుకున్న చమురు ధర ఇప్పుడు అమాంతం తగ్గిపోయింది. దీంతో ప్రపంచానికి భారీ ఊరట లభిస్తుంది.

హర్మూజ్ జలసంధి ఓపెన్ చేస్తాం.. ఇరాన్ ప్రకటన

క్రూడ్ ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచానికి ఇరాన్ ఊరట ఇచ్చింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. లెబ‌నాన్ తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీజ్ ఫైర్ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే చ‌మురు ధరలు భారీగా తగ్గిపోయాయి.

Next Story