plane crash: కొత్త ఇంటి కల నెరవేరకుండానే.. విమాన ప్రమాదంలో నర్సు మృతి

by Shamantha N |

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలను కదిలిస్తే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. విమాన ప్రమాదంలో మృతి చెందిన అనేక మంది తమ కలలు నెరవేరకుండానే చనిపోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎంతో మంది కలలు కల్లలుగా మారి.. వారి కుటుంబాలు అనాథలుగా మారిపోయాయి.

plane crash: కొత్త ఇంటి కల నెరవేరకుండానే.. విమాన ప్రమాదంలో నర్సు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలను కదిలిస్తే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. విమాన ప్రమాదంలో మృతి చెందిన అనేక మంది తమ కలలు నెరవేరకుండానే చనిపోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎంతో మంది కలలు కల్లలుగా మారి.. వారి కుటుంబాలు అనాథలుగా మారిపోయాయి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్లకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత గోపకుమార్, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించగా.. ఆమె ఇద్దరు పిల్లలు ఒంటరయ్యారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రంజిత యునైటెడ్ కింగ్‌డమ్‌లో నర్సుగా పనిచేస్తోంది. కేవలం నాలుగు రోజుల క్రితం ఇండియాకు ఆమె తిరిగి వచ్చింది. రంజిత సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె లండన్ నుంచి ఇండియాకు వచ్చి కేరళలోనే శాశ్వతంగా స్థిరపడాలనుకుంది. కేరళలో తిరిగి తన సేవ కొనసాగించాలనుకుంది.

లండన్ లో నర్సుగా..

రంజిత యూనిటైడ్ కింగ్ డమ్ వెళ్లకముందు ఓమన్ లోని సలాలలో కొన్ని రోజులు జాబ్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో నర్స్ గా పని చేస్తోంది. ఆమె తన కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి అందులోకి వెళ్లాలని కలలు కన్నది. రంజితకు తల్లి తులసీ కుట్టియమ్మ, 15 ఏళ్ల ఇందుచూదన్, 12 ఏళ్ల ఇతిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంజిత మొదట కేరళలో నర్సుగా పనిచేసి ఇక్కడి ఉద్యోగానికి రిజైన్ చేసి ఒమన్ లోని సలాలలో పని చేసింది. అక్కడి నుంచి లండన్ కు వెళ్లి అక్కడ నర్స్ జాబ్ చేస్తోంది. కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి తన పిల్లలు, తల్లితో కలిసి వెళ్లాలని కలలు కనేదని ఇంతలోనే విమాన దుర్ఘటనలో ప్రాణాలు విడిచిందని రంజిత సన్నిహితులు విలపించారు. గురువారం లండన్ వెళ్లేందుకు మొదట రంజిత చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లిందని, ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉండగా ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు.

Next Story