ప్రపంచ యుద్ధాలు, భారీ విపత్తులు.. 2026లో జరిగేవి ఇవేనట

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-01 11:31:21  IST  )

2026 గురించి షాకింగ్ విషయాలు చెప్పిన ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్టడమస్

ప్రపంచ యుద్ధాలు, భారీ విపత్తులు.. 2026లో జరిగేవి ఇవేనట
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు 2026లోకి అడుగుపెట్టింది. 2025లో మాన‌వాళి ఎన్నో విప‌త్తులు, భ‌యంక‌ర‌మైన యుద్ధాల‌ను చూసి 2026 అయినా ప్ర‌శాతంగా, సంతోషంగా సాగాల‌ని కోరుకుంటోంది. అయితే 2026లోనూ విప‌త్తులు, ప్ర‌పంచ యుద్ధాలు త‌ప్ప‌వ‌ని ప్ర‌ముఖ ష్రెంచ్ ఆస్ట్రాల‌జ‌ర్ నోస్ట్రాడ‌మ‌స్ దాదాపు 400ఏళ్ల క్రిత‌మే పేర్కొన్నారు. నోస్ట్రాడ‌మ‌స్ రాసిన లెస్ ప్రోఫెటీస్ అనే గ్రంథంలో 2026 ఎలా ఉండ‌బోతుందో తెలిపారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్ర‌పంచ యుద్ధాలు జ‌రుగుతాయ‌ని పుస్త‌కంలో పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్ ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అమెరికా, యూరోపియ‌న్ దేశాలు ఉక్రెయిన్ కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. ఈ ఉద్రిక్త‌త‌లు చాలా కాలంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు ఇండియాతో పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌తో పాటు మ‌రికొన్ని దేశాల మ‌ధ్య కూడా ఇలాంటి ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. నోస్ట్ర‌డ‌మ‌స్ త‌న గ్రంథ‌లో ఏఐ గురించి కూడా ముందుగానే చెప్పాడు. మానవ నియంత్ర‌ణ బ‌లహీన‌ప‌డి, నిర్ణ‌యం తీసుకునే శ‌క్తి మావేత‌ర శ‌క్తుల‌కు మారుతుంద‌ని పేర్కొన్నారు.

ఏఐ వ‌ల్ల సంభ‌వించే ప్ర‌మాదాల గురించి కూడా ముందుగానే అంచ‌నా వేశారు. ఈ ఏడాది స‌ముద్రంలోనూ ఉద్రిక్త‌త‌లు పెరుగుతాయ‌ని పేర్కొన్నాడు. స‌ముద్ర మార్గాల్లో ఇత‌ర దేశాల‌తో యుద్దాలు జ‌ర‌గ‌టంతో పాటు ప్ర‌కృతి వైప‌రీత్యాలు ఏర్ప‌డ‌తాయ‌ని అంచ‌నావేశారు. దీంతో స‌ముద్రానికి స‌రిహ‌ద్దుల్లో ఉండే తీర‌ప్రాంత జనాభాకు వినాశ‌క‌ర‌మైన ప‌రిణామాలు క‌లుగుతాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు ఎక్కువ‌గా నీటితోనే ముడిప‌డి ఉంటాయ‌ని తీవ్ర‌మైన వ‌ర్షాపాతం, భూకంపాలు, వ‌ర‌ద‌లు, సునామీలు లాంటివి సంభవిస్తాయ‌ని హెచ్చ‌రించారు.

Next Story