తుపాకీ పట్టిన ఉత్తర కొరియా 'రాకుమారి'.. ఫోటోలు విడుదల చేసిన అక్కడి మీడియా (ఫోటోలు)

by Ramesh Naini |   (  Updated:2026-03-12 11:07:33  IST  )

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జూ ఏ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యారు.

తుపాకీ పట్టిన ఉత్తర కొరియా రాకుమారి.. ఫోటోలు విడుదల చేసిన అక్కడి మీడియా (ఫోటోలు)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జూ ఏ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యారు. తాజాగా ఆమె పిస్టల్‌తో గురి చూసి కాల్పులు జరుపుతున్న ఫోటోలను ఆ దేశ అధికారిక మీడియా తాజాగా విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఆమె రైఫిల్ పట్టుకున్న ఫోటోలు బయటకు రాగా, ఇప్పుడు పిస్టల్ పట్టిన ఫోటోలు రావడంతో ఆమెను తదుపరి వారసురాలిగా కిమ్ సిద్ధం చేస్తున్నారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. గత నెలలో జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ ముగింపు వేడుకల్లో కిమ్ కుమార్తె జూ ఏ ప్రముఖంగా కనిపించారు. గురువారం విడుదలైన ఫోటోలలో, ఆమె ఒక పిస్టల్‌ను పట్టుకోని, ఒక కన్ను మూసి గురి చూస్తుండగా, తుపాకీ గొట్టం నుంచి నిప్పులు చిమ్ముతున్న దృశ్యాలు కనిపించాయి.

ఒక ప్రధాన ఆయుధ కర్మాగారాన్ని తన తండ్రితో కలిసి సందర్శించిన సందర్భంగా ఆమె ఈ విన్యాసం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తండ్రీ కూతుళ్లు ఇద్దరూ లెదర్ జాకెట్లు ధరించి కనిపించడం విశేషం. ఉత్తర కొరియాలో ఈ లెదర్ జాకెట్లను 'అధికారానికి చిహ్నం'గా పరిగణిస్తారని ఈస్ట్ ఏషియా, ఏఎఫ్‌పీ అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఆయుధ కర్మాగారంలో కొత్త రకం పిస్టళ్లను స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ పరీక్షించి, వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ' వెల్లడించింది. కాగా, 2022లో ఒక క్షిపణి (ICBM) ప్రయోగం సందర్భంగా జూ ఏ ప్రపంచానికి తొలిసారి పరిచయం చేశారు.

నార్త్ కొరియా ఎంబసీపై ఇజ్రాయెల్ మిసైల్..! యుద్ధంలోకి కిమ్ జోంగ్!

Next Story