- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్త్ కొరియా ఎంబసీపై ఇజ్రాయెల్ మిసైల్..! యుద్ధంలోకి కిమ్ జోంగ్!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇజ్రాయెల్ కు కిమ్ జోంగ్ వార్నింగ్..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య దేశాలలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయం(Embassy) పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని, దీనికి ప్రతిస్పందనగా కిమ్ జోంగ్ ఉన్ ఇజ్రాయెల్‌ను "తుడిచిపెట్టేస్తాం" అని హెచ్చరించినట్లు కొన్ని పోస్ట్‌లు ఫేస్‌బుక్, ఎక్స్ వైరల్ అయ్యాయి. "ఇజ్రాయెల్ తన పరిమితులను దాటుతోంది, ఇక యుద్ధం తప్పదు" అని ప్రకటన విడుదల చేశారు. ఇందులో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
వార్తల్లో నిజమెంత?
అంతర్జాతీయ వార్తా సంస్థలు, ఫ్యాక్ట్ చెక్ నిపుణులు ఈ వార్తలను పరిశీలించగా, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని తేలింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న ఉత్తర కొరియా రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ఎటువంటి అధికారిక ఆధారాలు లేవని తెలిపింది. ఇటు ఇరాన్ మీడియా కానీ, అటు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ 'KCNA' (Korean Central News Agency) కానీ ఈ ఘటనను ధృవీకరించలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా పోస్ట్‌లలో పాత సైనిక విన్యాసాల ఫోటోలను, గతంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన దాడుల ఫోటోలను వాడుతున్నట్లు గుర్తించారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం బీకరస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రజలలో భయాందోళనలు కలిగించడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి తప్పుడు సమాచారం స్ప్రెడ్ అవుతోందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో అధికారిక ప్రకటనలు వచ్చే వరకు సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి పోస్ట్‌లను నమ్మకూడదని నిపుణులు సూచిస్తున్నారు.






