స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

by Dishafeatures2 |
స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా
X

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఆదివారం స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించినట్లు సియోల్ అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త మిలిటరీ విన్యాసాల నడుమ వారం రోజుల వ్యవధిలో ఇది నాలుగో ప్రయోగమని పేర్కొంది. ఉత్తర కొరియా నిషేధిత ఆయుధాల ప్రయోగాల నడుమ అమెరికాతో కలిసి దక్షిణ కొరియా విన్యాసాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి చేపట్టిన డ్రిల్స్ ఐదేళ్లలోనే అతిపెద్దవని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ సైనిక చర్యలపై ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తమ విషయంలో జోక్యం చేసుకుంటే మిసైల్ ప్రయోగాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా ప్రయోగించిన మిసైల్ 800 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగలదని యూఎస్ విశ్లేషకులు చెప్పారు. జపాన్ తూర్పు సముద్రాలలో ఈ ప్రయోగం చేసినట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి నిబంధలను తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిందని విమర్శించారు.



Next Story

Most Viewed