BREAKING: అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు దుర్మరణం

by Shiva |
BREAKING: అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండల పరిధిలోని నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్, జతిన్, నవీన్ కుమార్, అజయ్ స్నేహితులు. అయితే, బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వారంతా ఆటోలో కలిసి యానాంకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆటో భట్నవిల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story