టీ-20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. కెప్టెన్ ఎవరంటే..?

by Disha Web Desk 19 |
టీ-20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. కెప్టెన్ ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత దేశ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్ నడుస్తున్నప్పటికీ.. క్రికెట్ ప్రియులు మాత్రం జూన్‌లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీ-20 వరల్డ్ కప్ తేదీ దగ్గరపడుతుండటంతో ఎలాగైనా కప్ కొట్టాలని అన్ని జట్లు కసరత్తు మొదలుపెట్టాయి. ధనాధన్ లీగ్‌కు అర్హత సాధించిన జట్ల మేనేజ్మెంట్లన్నీ ఆటగాళ్ల ఎంపికలో నిమగ్నమైపోయాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ వరల్డ్ కప్ స్కాడ్‌ను ప్రకటించింది. 14 మందితో జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కివీస్ స్టార్ ప్లేయర్ విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. అలెన్, బౌల్ట్, బ్రేస్ వెల్, చాప్‌మన్, కాన్వే, లాకీ ఫెర్గూసన్, హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, ఫిలిఫ్స్, రచీన్ రవీంద్ర, సాంటర్న్, సోధీ, సౌథీలకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. కాగా, ఏడాది టీ 20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తం అతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed