మాధవీలత బుర్ఖా తీసి చూడటం తప్పేం కాదు: చికోటి ప్రవీణ్

by Satheesh |
మాధవీలత బుర్ఖా తీసి చూడటం తప్పేం కాదు: చికోటి ప్రవీణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎం నేతల పనే దొంగ ఓట్లు వేయించడమని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మాధవీలత బుర్ఖా తీసి చూడటం తప్పేమీ లేదని ఆయన సమర్థించారు. ప్రశ్నించినందుకే మాధవీలతపై ఎంఐఎం నేతలు దాడికి దిగారని పేర్కొన్నారు. అది కాంగ్రెస్ కాదని, స్కాంగ్రెస్ అంటూ విమపర్శలు చేశారు. ఇదిలా ఉండగా వాస్తవానికి తాను కూడా ఆ పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయాల్సిందని, కానీ బిజీ షెడ్యూల్ వల్లే హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఎంఐఎం పార్టీ మారిందని ఆయన మండిపడ్డారు.

కేవంల ఏడు అసెంబ్లీ సీట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఓవైసీ బ్రదర్స్ సంక నాకుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అద్దంకి మూర్ఖంగా మాట్లాడారని, హిందువులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని చికోటి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను రాముడి వారసులా..? అని ప్రశ్నించాడని, మరి కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులా అని ప్రవీణ్ ప్రశ్నించారు. ఎన్నికల బరిలో లేనందుకు తనకు బాధగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, బీజేపీ మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని చికోటి ప్రవీణ్ ధీమా వ్యక్తంచేశారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడంతో మైనారిటీ ఓట్లు బీజేపీకి పడతాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed