మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల ఘటనలో విచారణ

by Sridhar Babu |
మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల ఘటనలో విచారణ
X

దిశ, కామారెడ్డి : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే మహిళా వైద్యుల పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్ ఓ డాక్టర్ లక్ష్మణ్ సింగ్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు బుధవారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ డీహెచ్ అమర్ సింగ్ నాయక్ కలెక్టరేట్లోని డీ ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులతో మాట్లాడి వివరాలను నమోదు చేశారు. అయితే విచారణ జరుగుతున్న సమయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఓ మెడికల్ ఆఫీసర్ను లైంగికంగా వేధించినట్లు సాక్ష్యాలతో ఫిర్యాదు వచ్చినందున

కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్ పై సుమారు రెండు గంటల పాటు పూర్తిస్థాయి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను క్లుప్తంగా విచారణ అధికారి ముందు వివరించారు. విచారణ అధికారి అమర్ సింగ్ బాధిత వైద్యులతో రాతపూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. వీటిని వైద్యశాఖ కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్ విచారణలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లైంగిక వేధింపులపై జిల్లా ఎస్పీకి బాధిత వైద్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Next Story

Most Viewed