అమెరికాతో అణు చర్చలు జరిపేది లేదు: ఇరాన్

by Shamantha N |

ఇజ్రాయిల్ తమపై దాడులు చేస్తున్నంత కాలం అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు ఉండవని ఇరాన్ తేల్చి చెప్పింది.

అమెరికాతో అణు చర్చలు జరిపేది లేదు: ఇరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ తమపై దాడులు చేస్తున్నంత కాలం అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు ఉండవని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ చర్చలకు రాకపోతే రెండు వారాల్లో దాడులు చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. అణు ఒప్పందంపై చర్చలకు రావాలని అమెరికా పేర్కొందని కానీ వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులు చేస్తుండగా వాటి వెనకాల కచ్చితంగా అమెరికా ఉందని అనుమానిస్తున్నాం. ట్రంప్ తమ ప్రమేయం లేదని చెబుతున్నా అమెరికా ప్రోత్సాహంతోనే ఇజ్రాయిల్ దాడులు చేస్తుందని ఇరాన్ తో పాటు అన్ని దేశాలు నమ్ముతున్నాయి.

చైనా సాయం చేస్తోందా?

ఇరాన్ కు రహస్యంగా చైనా సాయం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోయింగ్ విమానంలో ఇరాన్ కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసిందని అనుమానిస్తున్నారు. లక్సెంబర్గ్ వెళ్లాల్సిన విమానం ఇరాన్ గగన తలంలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ పై అమెరికా దాడికి పాల్పడితే రష్యా ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండగా పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ క్రమంలో వైట్‌హౌస్ (White House) స్పందిస్తూ.. డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.

Next Story