Bungee Jump : సైకో భార్య నుంచి విడాకులు వచ్చిన ఆనందంలో బంజీ జంప్ చేసిన వ్యక్తి.. అంతలోనే ఏం జరిగిందంటే?

by Dishanational1 |
Bungee Jump : సైకో భార్య నుంచి విడాకులు వచ్చిన ఆనందంలో బంజీ జంప్ చేసిన వ్యక్తి.. అంతలోనే ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తనను ఎప్పటినుంచో వేధిస్తన్న భార్య నుంచి ఓ యువకుడికి విడాకులు లభించాయి. దీంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ ఆనందాన్ని అతను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ సంతోషంలో అతను ప్రమాదానికి గురవుతాడని ఎవరూ ఊహించలేదు. అతడు ఒకటనుకుంటే విధి మరొకటి తలచింది.

ఆ యువకుడు చేసిన దుస్సాహసం బెడిసికొట్టింది. అతడి కొంపముంచింది. ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్రంగా గాయపడేలా చేసింది. చావు అంచుల వరకు వెళ్లాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఆ యువకుడి పేరు రాఫెల్ డాస్ సాంటోస్ టోస్తా. వయసు 22 ఏళ్లు. పెళ్లి కూడా అయ్యింది. అయితే, కొన్నాళ్లకే భార్యతో గొడవలు మొదలయ్యాయి. అంతే, మ్యాటర్ విడాకులకు వెళ్లింది. కోర్టుని ఆశ్రయించగా.. వారిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. దాంతో రాఫెల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాడు. ఇందుకోసం అతడు సాహసం చేశాడు. బంగీ జంప్ ఎంచుకున్నాడు.

ఏకంగా 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది. మధ్యలోనే తాడు తెగిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. రాఫెల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మెడ, చేతులు, కాళ్ల ఎముకలు విరిగాయి. కానీ తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాఫెల్ ప్రాణాలతో బయటపడి కోలుకుంటున్నాడు. అతడి ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. డివోర్స్ రావడంతో వేడుకలు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇలా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed