- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను చావలేదు...మరో వీడియో రిలీజ్ చేసిన నెతన్యాహు
తాను చనిపోలేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా జెరూసలెం ప్రాంతంలో స్థానికులతో ముచ్చటిస్తూ మరో వీడియోను నెతన్యాహు రిలీజ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 15 రోజులకు పైగా ఈ మూడు దేశాలు తలపడుతున్నాయి. ఇజ్రాయెల్ అలాగే అమెరికా రెండు కలిసి యుద్ధం చేసినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఖమేనీని పోగొట్టుకున్న ఇరాన్, రెట్టింపు ఉత్సాహంతో దూసుకు వస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు ఇరాన్ ప్రచారం చేసింది. తమ దాడుల నేపథ్యంలో ఇప్పటికే మరణించాడు అని పేర్కొంది.
నెతన్యాహు మరో వీడియో
ఇరాన్ ప్రచారం చేసిన నేపథ్యంలో అందరూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెంది ఉంటాడని అనుకున్నారు. అయితే, ఆ వార్తలను ఖండిస్తూ ఇటీవల కాఫీ తాగుతున్న వీడియోను నెతన్యాహు స్వయంగా రిలీజ్ చేశారు. కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటర్ వీడియో కావచ్చని గ్రోక్ పేర్కొంది. దీంతో తాజాగా మరో వీడియోను కూడా షేర్ చేశాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
జెరూసలెం ప్రాంతంలో స్థానికులతో ముచ్చటిస్తూ ఈ వీడియోలో కనిపించారు నెతన్యాహు. అయితే ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ వీడియోలో నెతన్యాహు వేలికి ఉంగరం ఓ సారి ఉన్నట్లు... మరొకసారి లేనట్లు కనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.






