నేను బ‌తికే ఉన్నా..నెత‌న్యాహు మ‌రో వీడియో

by velandi.Saikiran |   (  Updated:2026-03-18 09:31:35  IST  )

తాను చనిపోలేదని రెండు వీడియోలు విడుదల చేసిన బెంజమిన్ నెత‌న్యాహు, మూడో వీడియోను రిలీజ్ చేసి ఇరాన్ కు షాక్ ఇచ్చాడు.

నేను బ‌తికే ఉన్నా..నెత‌న్యాహు మ‌రో వీడియో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. హ‌ర్ముజ్ జల సంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇండియా లాంటి చాలా దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ ఈ మూడు దేశాలు మాత్రం యుద్ధంలో ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ ఇప్పటికే మరణించారు. అయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అయితే దానికి ప్రతికారంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత‌న్యాహును చంపేసినట్లు ఇరాన్ వెల్లడించింది.

మూడో వీడియో రిలీజ్ చేసిన నెత‌న్యాహు

కానీ తాను చనిపోలేదని ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేసిన బెంజమిన్ నెత‌న్యాహు, తాజాగా మూడో వీడియోను రిలీజ్ చేసి ఇరాన్ కు షాక్ ఇచ్చాడు. మీరు ఎలా ఉన్నారో కనుక్కోమని ట్రంప్ ఆదేశించారని, అమెరికా రాయబారి మైక్ హుకబీ నవ్వుతూ అడిగినట్లు ఈ వీడియో రిలీజ్ చేశారు. ఇక దానికి బెంజమిన్ నెత‌న్యాహు తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. అవును మైక్.. నేను ఇంకా బతికే ఉన్నాను, చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు బెంజమిన్ నెత‌న్యాహు. మనం ప్రతి చేతికి 5 వేళ్ల‌ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని, 6 వేళ్ల‌ రూమర్లకు చెక్ పెడుతూ కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇది కూడా ఏఐ వీడియోనే అంటూ ఇరాన్ చెబుతోంది.

మాకు ఎవరి సాయం అక్కర్లేదు.. నాటో దేశాల‌పై ట్రంప్ ఫైర్‌

Next Story