మాకు ఎవరి సాయం అక్కర్లేదు.. నాటో దేశాల‌పై ట్రంప్ ఫైర్‌

by velandi.Saikiran |   (  Updated:2026-03-18 09:32:21  IST  )

ఇరాన్ పై యుద్ధానికి అమెరికాకు ఇకపై సహాయం అవసరం లేదని చెబుతూ నాటో మిత్రదేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు.

మాకు ఎవరి సాయం అక్కర్లేదు.. నాటో దేశాల‌పై ట్రంప్ ఫైర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు వారాలకు పైగా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమకు నాటో దేశాల సహాయం అవసరం లేదంటూ ఘాటుగా స్పందించారు ట్రంప్. నాటో దేశాలు ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో సీరియస్ అయ్యారు ట్రంప్.

నాటో ఎప్పుడూ కూడా వన్ వే ట్రాఫిక్ లాంటిదేనని పేర్కొన్నారు. మేం నాటో దేశాల‌ను రక్షిస్తాం.. కానీ వాళ్లు మాత్రం తమకు సహాయం ఎప్పుడు చేయలేదని, ఇప్పుడు కూడా చేయడం లేదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ట్రంప్. ఇకపై వాళ్ళ సహాయం తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దేశ సైనిక శక్తిని ఇప్పటికే చిన్నాభిన్నం చేశామని వెల్లడించారు ట్రంప్. అందుకే ఇకపై తమకు ఎవరి సహాయం అవసరం లేదని తెలిపారు. అమెరికా ఒంటరిగానే ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తమదే పైచేయని వ్యాఖ్యానించారు ట్రంప్.

''

నేను బ‌తికే ఉన్నా..నెత‌న్యాహు మ‌రో వీడియో

Next Story