- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్ర సముద్రంలో తెగిపోయిన నెట్ కేబుల్స్.. నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
ఎర్ర సముద్రం (Red Sea)లో అనుకొని ప్రమాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీకి కీలకమైన సబ్‌మెరిన్ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ తెగిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఎర్ర సముద్ర (Red Sea) గర్భంలో అనుకొని ప్రమాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీ (International Internet Connectivity)కి కీలకమైన సబ్‌మెరిన్ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో ఆసియా, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఘటన సౌదీ అరేబియాలో జిద్దా సమీపంలోని SEA-ME-WE-4, IMEWE, FALCON GCX వంటి ప్రధాన కేబుల్ వ్యవస్థల్లో మార్గాలు ద్వసం అయ్యాయి.ఈ ఫలితంగా భారతదేశంలో, పాకిస్తాన్, UAE వంటి దేశాల్లో ఇంటర్నెట్ వేగం పడిపోయింది. క్లౌడ్ నిర్మాణాల్లో ముఖ్యమైన పాత్ర వహించే Microsoft Azure సేవలు కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటుంది.Microsoft ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను reroute చేసి, సేవలను సాధ్యమైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈ పరిస్థితి సబ్‌మెరిన్ కేబుల్స్ (Submarine cables) ద్వారా లభించే గ్లోబల్ డిజిటల్ మౌలిక వసతుల ఉద్రిక్తతను స్పష్టం చేసింది. ఇప్పటివరకు.. ఈ కేబుల్‌లకు దెబ్బ తగిలిన కారణం ఇంకా అస్పష్టంగా ఉండగా పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Tags
- Red Sea






