- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనాలో అన్వేష్ ప్రత్యక్షం..శత్రు దేశం కాదంటూ సంచలనం !
చైనాలో అన్వేష్ ప్రత్యక్షం అయ్యాడు. చైనా శత్రు దేశం కాదంటూ సంచలన ప్రకటన చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ గురించి తెలియని వారు ఉండరు. కరోనా సమయంలో ట్రావెలర్ గా మారిన అన్వేష్, కోట్లల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. నిత్యం విదేశాల్లోనే ఉండే ఈ అన్వేష్, తన వీడియోలతో జనాలను ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో అనవసరమైన వివాదాలలో చిక్కుకుంటున్న అన్వేష్, ప్రస్తుతం చైనాలో ట్రావెల్ వీడియోలు చేస్తున్నాడు. 40 రోజుల పాటు పర్యటన అంటూ తాజాగా కొత్త వీడియో పెట్టి రచ్చ చేశాడు. ఇందులో చైనాలో జరిగే డెవలప్మెంట్ గురించి చూపిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కంటే చైనా అభివృద్ధిలో దూసుకుపోతోందని పరోక్షంగా చెబుతూ కించపరిచే ప్రయత్నం కూడా చేశాడు. అలాగే ఇండియాకు చైనా మిత్ర దేశమే అంటూ వ్యాఖ్యానించాడు. కొంతమంది శత్రుదేశం అని భావిస్తున్నారు... కానీ ఇదంతా తప్పు ముచ్చట అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. చైనా అవసరం ఇండియాకు ఉంటుందని తెలిపారు. అక్కడి నుంచి చాలా రకాల ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇండియా దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తు చేశారు. వాళ్లతో శత్రుత్వం పెట్టుకుంటే, ఎలక్ట్రిక్, ఇతర వస్తువుల కొరత ఇండియాలో ఏర్పడుతుందని హెచ్చరించాడు. దీంతో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బార్డర్ లో ఇండియాతో గొడవ పడుతున్న చైనా ను మిత్ర దేశం ఎలా ఉంటాడని ఫైర్ అవుతున్నారు.






