- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assam illegal immigration: నా తల్లిని అక్రమంగా నిర్బంధించారు: సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్
అస్సాం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన తల్లి మనోవర బెవాను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆమె ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదని వాపోయాడు. అత్యున్నత న్యాయస్థానంలో తన తల్లి కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.

దిశ, నేషనల్ డెస్క్: అస్సాం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన తల్లి మనోవర బెవాను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆమె ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదని వాపోయాడు. అత్యున్నత న్యాయస్థానంలో తన తల్లి కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. మనోవర బెవాను బంగ్లాదేశ్‌కి చెందిన మహిళగా గుర్తించిన అస్సాం అధికారులు గతంలో ఆమెను అదుపులోకి తీసుకుని మూడు సంవత్సరాలు నిర్బంధ శిబిరంలో ఉంచారు. 2019లో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదల అయ్యారు. అప్పటి నుంచి అస్సాంలో నివసిస్తూ, కోర్టు విధించిన నిబంధనలను పాటిస్తున్న ఆమెను ఇటీవల పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
విచారణకు ఓకే చెప్పిన సుప్రీం కోర్టు
ఈ మేరకు బాధిత మహిళ కుమారుడు పిటిషన్‌లో ‘నా తల్లి సుప్రీంకోర్టు సూచనలను కచ్చితంగా పాటిస్తూ జీవిస్తోంది. ఇటీవల స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు. అప్పటి నుంచి ఆమె కనిపించలేదు. స్టేషన్‌కు వెళ్లినా, ఆమెను కలిసే అవకాశం ఇవ్వలేదు. నా తల్లి కేసు ఇప్పటికీ కోర్టులో ఉంది అని చెప్పినా ఆమెను విడుదల చేయలేదు. ఆమె ఎక్కడ ఉన్నారన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నాడు. సర్వోన్నత న్యాయస్థానం యువకుడి తల్లిని అక్రమంగా నిర్బంధించిన అంశంపై త్వరలోనే విచారణ చేపట్టే అవకాశముంది.






