- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: వెనెజువెలాలో భారీ పేలుళ్లు
వెనెజువెలా రాజధాని కరాకస్ లో భారీ పేళ్లు చోటుచేసుకున్నాయి. నిమిషాల వ్యవధిలో ఏడు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో అమెరికా కొంతకాలంగా వెనెజువెలా లక్ష్యంగా పలు హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో ఆ దేశ రాజధాని కరాకస్ లో భారీ పేళ్లు చోటుచేసుకున్నాయి. నిమిషాల వ్యవధిలో ఏడు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. డ్రగ్స్ ను తరలిస్తున్న బోట్స్, జలాంతర్గాములపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. ఈ పరిణామాల నడుమ తాజాగా వెనెజువెలాలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున పేలుడు శబ్దాలు వినిపించడంతో.. ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు.
చమురు నిల్వలు, ఖనిజాల కోసం ట్రంప్ ప్లాన్?
అమెరికా సైన్యం విడుదల చేసిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు జరిపిన 30 కంటే ఎక్కువ దాడుల్లో 107 మంది మరణించినట్లు తెలిపింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రం మాదకద్రవ్యాల కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని వాపోయారు. తమదేశంలో ఉన్న అతిపెద్ద చమురు నిల్వలు, అరుదైన భూమి ఖనిజ సంపద కోసం ట్రంప్ తనను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా.. ఇప్పటి వరకూ వెనెజువెలా ప్రభుత్వం, అమెరికా ఈ పేలుళ్లపై స్పందించకపోవడం గమనార్హం.
https://x.com/anthonyseijas2/status/2007336481984324059?s=20






