Mr Beast : మిస్టర్ బీస్ట్.. నువు నిజంగా గ్రేట్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-07 15:26:38  IST  )

ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్(Mr Beast) దాతృత్వం(Donations)లోనూ ముందు ఉంటాడు.

Mr Beast : మిస్టర్ బీస్ట్.. నువు నిజంగా గ్రేట్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్(Mr Beast) దాతృత్వం(Donations)లోనూ ముందు ఉంటాడు. జిమ్మీ డొనాల్డ్‌సన్‌గా పిలవబడే మిస్టర్ బీస్ట్, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీస్ట్ ఫిలాంత్రోపీ సంస్థను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా ఆకలి, నిరాశ్రయం, నిరుద్యోగ సమస్యలను తగ్గించేందుకు అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టాడు. అతని ఛానెల్‌లోని యాడ్ రెవెన్యూ, మర్చండైజ్, స్పాన్సర్‌షిప్‌ల నుండి వచ్చే 100% ఆదాయం దానధర్మాలకు వెళ్తుంది. ఇందులో తన స్వస్థలమైన నార్త్ కరోలినాలో నెలకు 1,00,000 భోజనాలను అందించే ఫుడ్ ప్యాంట్రీ ఏర్పాటు చేశారు. ఆఫ్రికాలో 5 లక్షల బోరు బావుల నిర్మాణం, విద్యార్థులకు 20,000 జతల బూట్లు, స్కూళ్ళలో సాంకేతికత ఏర్పాటు చేశారు.

వేల మందికి కంటి శస్త్రచికిత్సలు, వినికిడి సామర్థ్యం సర్జరీలు, కిట్లు అందజేశారు. టీమ్ ట్రీస్ ద్వారా 23 మిలియన్ చెట్లు నాటడం, టీమ్ సీస్ ద్వారా 33 మిలియన్ పౌండ్ల సముద్ర శిధిలాల తొలగింపు వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు $3 మిలియన్ సహాయం, ఫిలడెల్ఫియాలో షేరింగ్ ఎక్సెస్‌తో కలిసి లక్షల పౌండ్ల విలువైన ఆహారం పంపిణీ, యుగాండాలో గివ్‌ డైరెక్ట్‌తో $200,000 నగదు సహాయం వంటి అనేక కార్యక్రమాలను బీస్ట్ నిర్వహిస్తున్నాడు. బీస్ట్ దాతృత్వానికి నిజంగా నువు గ్రేట్ బీస్ట్ అంటూ, అసలైన శ్రీమంతుడివి నువ్వే అంటూ కొనియాడుతున్నారు.

Next Story