- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాకు చేరుకున్న శశి థరూర్ టీమ్
by Ajay Maddhiboyina |
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సారథ్యంలోని ఎంపీల బృందం నేడు అమెరికాకు చేరుకుంది. పాకిస్థాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భార

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సారథ్యంలోని ఎంపీల బృందం నేడు అమెరికాకు చేరుకుంది. పాకిస్థాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఇతర అంశాలను టీమ్ ట్రంప్ ప్రభుత్వానికి వివరించనుంది. మరోవైపు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం కథర్‌లో పర్యటిస్తోంది. అదే విధంగా అసదుద్దీన్ ఓవైసీ బృందం బహ్రెయిన్ లో పర్యటించి అక్కడి ప్రభుత్వానికి ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్థాన్ తీవ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది అనే అంశాల గురించి వివరించింది. ఇలా మొత్తం ఏడు బృందాలు అనేక దేశాల్లో పర్యటిస్తూ పాకిస్థాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి వివరిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాక్ వక్రబుద్ధి గురించి తెలిసే అవకాశం ఉంది.
Next Story






