బౌద్ధ సన్యాసుల సెక్స్.. 80వేల శృంగార వీడియోలు.. దేశాన్ని షేక్ చేస్తున్న ఘటన

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-21 13:09:47  IST  )

థాయిలాండ్‌లోని బౌద్ధ సన్యాసులకు సంబంధించిన విలావన్ ఎమ్సావత్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సన్యాసులకు సంబంధించిన సెక్స్ వీడియోలతో కోట్లు సంపాదిస్తున్న మహిళ బండారం బయటపడింది.

బౌద్ధ సన్యాసుల సెక్స్.. 80వేల శృంగార వీడియోలు.. దేశాన్ని షేక్ చేస్తున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : థాయిలాండ్‌లోని బౌద్ధ సన్యాసులకు సంబంధించిన విలావన్ ఎమ్సావత్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సన్యాసులకు సంబంధించిన సెక్స్ వీడియోలతో కోట్లు సంపాదిస్తున్న మహిళ బండారం బయటపడింది. విలావన్ ఎమ్సావత్ అనే మహిళ.. మిస్ గోల్ఫ్‌గా కూడా పిలువబడుతుంది. జూలై 15న బ్యాంకాక్ సమీపంలోని నోంథబురి ప్రావిన్స్‌లోని తన లగ్జరీ హోమ్‌లో అరెస్టు చేయబడింది. ఆమెపై బ్లాక్‌మెయిల్, మనీలాండరింగ్, దొంగిలించిన వస్తువుల స్వీకరణ, అవినీతికి సహకరించిన ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని వాట్ ట్రి థోట్సాథెప్ మఠాధిపతి ఫ్రా థెప్ వచిరపమోక్ జూన్ 2025 మధ్యలో అకస్మాత్తుగా అదృశ్యమైన తర్వాత పోలీసు విచారణ ప్రారంభమైంది.

కుంభకోణం

ఎమ్సావత్ మఠాధిపతులతో సహా తొమ్మిది మంది సీనియర్ సన్యాసులను ఆకర్షించింది. థెరవాద బౌద్ధ సన్యాసుల సెలిబసీ ప్రమాణాలను ఉల్లంఘించే విధంగా లైంగిక సంబంధాలు కలిగి ఉంది. ఈ సందర్భాలలో ఆమె 80,000 కంటే ఎక్కువ స్పష్టమైన ఫోటోలు, వీడియోలను రికార్డు చేసి.. వాటిని సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించింది. మూడు సంవత్సరాలలో .. సుమారు రూ. 102 కోట్లు దోచుకుంది. ఈ నిధులు తరచూ ఆలయ ఖాతాల నుండి బదిలీ చేయబడ్డాయి. తాను గర్భవతినని.. అతనే తన బిడ్డకు తండ్రి అని చెప్పి.. మెర్సిడెస్-బెంజ్ SLK200 వంటి ఖరీదైన బహుమతులు కూడా అందుకుంది. దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగం ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఖర్చు చేసింది.

ఎమ్సావత్ ఇంటిపై జరిగిన పోలీసు దాడుల్లో ఐదు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేయబడ్డాయి. ఇందులో నేరాలకు సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. విభిన్న ఆలయాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. సన్యాసుల నుండి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ ఉండగా.. వీరిలో కొందరు ఆమె డిమాండ్లను తీర్చడానికి ఆలయ నిధులను దుర్వినియోగం చేశారు. కాగా అరెస్టుకు ముందు ఎమ్సావత్ థాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు సన్యాసులు, ఒక మత విద్వాంసుడితో సంబంధాలు ఉన్నాయని.. తాను ప్రేమలో పడ్డానని, ఒక సన్యాసికి డబ్బు కూడా ఇచ్చానని చెప్పింది. కాగా ఎమ్సావత్ జూలై 17న అదుపులోకి తీసుకోబడగా.. 12 రోజుల పాటు బెయిల్ కోసం దరఖాస్తు చేయకుండా నిర్బంధంలో ఉంది. విచారణ లోతుగా సాగుతోంది.

Next Story