Narendra Modi : నెదర్లాండ్స్‌‌లో మోడీకి ఘనస్వాగతం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-16 05:11:48  IST  )

ప్ర‌ధాని మోడీ శుక్రవారం ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మొదట యూఏఈ దేశానికి వెళ్లిన మోడీ ఆ పర్యటన ముగించుకుని శనివారం నెదర్లాండ్ లో అడుగుపెట్టారు.

Narendra Modi : నెదర్లాండ్స్‌‌లో మోడీకి ఘనస్వాగతం
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీ శుక్రవారం ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మొదట యూఏఈ దేశానికి వెళ్లిన మోడీ ఆ పర్యటన ముగించుకుని శనివారం నెదర్లాండ్ లో అడుగుపెట్టారు. నెదర్లాండ్ లో అడ్జటెంట్ జనరల్, మహారాజు మిలిటరీ హౌస్ హోల్డ్ చీఫ్, డచ్ దేశ విదేశాంగ మంత్రి ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి హోటల్ కు చేరుకుని హేగ్ లో ప్రవాస భారతీయులతో మోడీ సమావేశమయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక, శాస్త్రీయ ప్రదర్శనలను వీక్షించారు.

నెదర్లాండ్స్ పర్యటనలో టెక్, ఇంధన, వాణిజ్య సంబంధాలపై చర్చించి వాటిిని పెంపొందించాలని మోడీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అంతకు ముందు మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించగా ఇంధనం, రక్షణ, సముద్ర సదుపాయాలతో పాటు ఇతర రంగాలకు సంబంధించి వ్యూహాకాత్మక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక నెదర్లాండ్స్ పర్యటన పూర్తైన తరవాత మోడీ స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. అక్కడ సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, సముద్ర రవాణా, రక్షణ రంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Next Story