మోడల్ హత్య.. శవం కావాలంటే రూ. 50లక్షలు చెల్లించాలని డిమాండ్..

by Sujitha Rachapalli |

బెలారూస్‌కు చెందిన మోడల్ వెరా క్రావ్త్సోవాకు బ్యాంకాక్‌లో మోడలింగ్ ఆఫర్ వచ్చింది. 26ఏళ్ల ఈ అమ్మాయి.. ఎన్నో ఆశలతో అక్కడికి చేరింది. కానీ ఆమె తన చావును వెతుక్కుంటూ వెళ్లిందని తర్వాత అర్థమైంది. కారణం అక్టోబర్ 12న బ్యాంకాక్‌లో ల్యాండ్ కాగానే

మోడల్ హత్య.. శవం కావాలంటే రూ. 50లక్షలు చెల్లించాలని డిమాండ్..
X

దిశ, వెబ్ డెస్క్ : బెలారూస్‌కు చెందిన మోడల్ వెరా క్రావ్త్సోవాకు బ్యాంకాక్‌లో మోడలింగ్ ఆఫర్ వచ్చింది. 26ఏళ్ల ఈ అమ్మాయి.. ఎన్నో ఆశలతో అక్కడికి చేరింది. కానీ ఆమె తన చావును వెతుక్కుంటూ వెళ్లిందని తర్వాత అర్థమైంది. కారణం అక్టోబర్ 12న బ్యాంకాక్‌లో ల్యాండ్ కాగానే ఆమెను హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా నెట్ వర్క్ తమ కాంపౌండ్‌కు తీసుకెళ్లి బంధించింది. వారి డిమాండ్స్‌కు తలొగ్గకపోవడంతో చంపేసింది. బాడీ పార్ట్‌లన్నీ అమ్మేసింది. ఈ ఘటన నార్త్ తూర్వాసియాలోని ట్రాఫికింగ్ రింగ్ ప్రమాదాలను హైలెట్ చేస్తుంది.

మోడల్ వెరా క్రావ్త్సోవా ఆన్‌లైన్‌ ప్రకటన చూసి అప్లయ్ చేసింది. దీనికి స్పందించిన ట్రాఫికర్లు.. ప్రయాణ ఖర్చులతోపాటు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు. దీంతో ఆమె ఆఫర్ కోసం వెళ్లింది. కానీ అక్కడ దిగగానే ట్రాఫికర్లు.. పాస్ పోర్టు, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దాడి చేశారు. మయన్మార్ సరిహద్దులను దాటి తమ కాంపౌండ్‌కు తీసుకెళ్లారు. మయావాడ్డి ప్రాంతాలు, చైనీస్ క్రిమినల్ సిండికేట్లు, స్థానిక మిలిషియాలు నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం స్మగ్లింగ్‌కు కేరాఫ్.. కాగా ఇవి టెక్ హబ్‌లుగా డిజైన్ చేసిన జైళ్లు. హనీ ట్రాప్, పెట్టుబడి మోసాలు, డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా ఇతర దేశస్తులను అట్రాక్ట్ చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. ఇదే మోడల్ విషయంలోనూ జరిగింది. ఆమెను బంధించి, హత్య చేశాక బంధువులకు కాల్ చేశారు. శవాన్ని తీసుకోవడానికి దాదాపు రూ. 50లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ ఇది తీర్చకపోవడంతో.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసి ఆమె ఆర్గాన్స్ బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినట్లు చెప్పారు.

Next Story