మేము హిందూస్..హిందీ కాదు.. కేంద్రంపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఫైర్

by Ajay Maddhiboyina |

హిందీని మూడో భాషగా స్కూళ్లలో భోదించడంపై మహరాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఫైర్ అయ్యారు.

మేము హిందూస్..హిందీ కాదు.. కేంద్రంపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: హిందీని మూడో భాషగా స్కూళ్లలో భోదించడంపై మహరాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. మేం హిందూస్ కానీ హిందీ కాదు అని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని ఠాక్రే వ్యతిరేకించారు. మహరాష్ట్రకు హిందీ రంగు వేయడానికి ప్రయత్నిస్తే రాష్ట్రంలో మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే కేంద్రం కావాలనే ఇలా చేస్తుందని అర్థమవుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మరాఠీలు, మరాఠీయేతరుల మధ్య విభేదాలు సృష్టించి ల‌బ్ధి పొంద‌డానికే ఋ ప్ర‌య‌త్నం చేస్తోందా..? అని ప్ర‌శ్నించారు.

హిందీ రాష్ట్ర‌ భాష కాద‌ని అలాంట‌ప్పుడు మ‌హరాష్ట్ర‌లోని విద్యార్థుల‌కు ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఆ భాష ఎందుకు భోదించాల‌ని ప్ర‌శ్నించారు. మీ త్రిభాషా ఫార్ములాను ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం అయ్యేలా చేయాల‌ని కేంద్రానికి హిత‌వు ప‌లికారు. విద్య‌లోకి తీసుకురావ‌ద్ద‌ని, ఈ దేశంలో భాషా ప్రాంతీయ‌క‌ర‌ణ జ‌రిగింద‌ని అన్నారు. చాలా ఏళ్లుగా ఇది కొన‌సాగుతోంద‌ని, ఇప్పుడు మ‌హారాష్ట్ర‌పై మ‌రొక ప్రాంతం భాష‌ను ఎందుకు రుద్దుతున్నార‌ని నిల‌దీశారు. దీనివ‌ల్ల భాష ప్రాంతీయ‌క‌ర‌ణ సూత్రం దెబ్బ తింటుందని మండిపడ్డారు.

Next Story