రాష్ట్రాలకు కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాలి..బాంబు పేల్చిన స్టాలిన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-24 23:30:08  IST  )

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నీతి ఆయోగ్ 10వ పాల‌క మండ‌లి స‌మాయ‌వేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా

రాష్ట్రాలకు కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాలి..బాంబు పేల్చిన స్టాలిన్
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నీతి ఆయోగ్ 10వ పాల‌క మండ‌లి స‌మాయ‌వేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్రం ప‌న్ను ఆదాయంలో రాష్ట్రాల‌కు 50 శాతం వాటా ఇవ్వాల‌ని ఒత్తిడి చేశారు. అధికార వికేంద్రీక‌ర‌ణ అంశాన్ని స్టాలిన్ లేవ‌నెత్తుతూ రాష్ట్రాలు ప్ర‌స్తుతం కేంద్ర ప‌న్నులో 33.16 శాతం మాత్ర‌మే పొందుతున్నాయ‌ని చెప్పారు.

ఇది గ‌తంలో వాగ్దానం చేసిన 41 శాతం కంటే చాలా త‌క్కువ అని అన్నారు. ఇదే విష‌యం గురించి సోష‌ల్ మీడియాలోనూ స్టాలిన్ ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో, కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు చట్టబద్ధమైన 50 శాతం వాటాను ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన‌ట్టు తెలిపారు. వాగ్దానం చేసిన 41 శాతం కాకుండా ప్రస్తుతం మనకు 33.16 శాతం మాత్రమే ఇస్తున్నార‌ని పేర్కొన్నారు.

Next Story