ఘోర రోడ్డు ప్రమాదం.. మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ మృతి

by Sujitha Rachapalli |

మాజీ యూనివర్స్ కంటెస్టెంట్, మిస్ రష్యా క్సెనియా అలెక్సాండ్రోవా మరణించింది. కొత్తగా పెళ్లి అయిన ఆమె.. 30ఏళ్ల వయసులోనే తనువు చాలించింది. జూలై 5న రష్యాలోని ట్వెర్ ఒబ్లాస్ట్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆగస్టు 12న కన్నుమూసింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ యూనివర్స్ కంటెస్టెంట్, మిస్ రష్యా క్సెనియా అలెక్సాండ్రోవా మరణించింది. కొత్తగా పెళ్లి అయిన ఆమె.. 30ఏళ్ల వయసులోనే తనువు చాలించింది. జూలై 5న రష్యాలోని ట్వెర్ ఒబ్లాస్ట్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆగస్టు 12న కన్నుమూసింది. భర్త ఇలియా డ్రైవ్ చేస్తున్న తన లగ్జరీ కారు పోర్షే పనమెరాలో జర్నీ చేస్తుండగా.. ఎమ్-9 హైవేపై అకస్మాత్తుగా ఓ జంతువు రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో విండ్‌షీల్డ్‌ను తగలడంతో.. క్సెనియా తలకు తీవ్రగాయమైంది. ఫ్రంటల్ బోన్స్ విరిగి, ఓపెన్ క్రానియల్ ఇంజ్యూరీ అయింది. తీవ్రగాయాలతో రక్తంతో నిండిపోయి స్పృహ కోల్పోయిన ఆమెను.. 15 నిమిషాల్లో ఆస్పత్రికి తరలించాడు భర్త.

తర్వాత స్పృహలోకి వచ్చినా.. మెనింజైటిస్‌ వచ్చింది. బ్లడ్ సెప్సిస్, మెదడు వాపు వ్యాధులకు దారితీసింది. దీంతో రెండు శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు.. రెండో సారి కోమాకు వెళ్లిన ఆమెను బతికించలేకపోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిందని.. తనను బతికించుకోలేకపోయానని కన్నీరు పెట్టుకున్నాడు భర్త. కాగా మార్చిలో ఇలియాను మ్యారేజ్ చేసుకున్న క్సెనియా.. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Next Story