- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొలంబియాలో కుప్పకూలిన విమానం.. 110 మంది మృతి?
కొలంబియన్ వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. ఈ ప్రమాదంలో 110 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వాతావరణం అనుకూలించకపోవడం, విమానాలలో సాంకేతిక సమస్యలు రావడంతో కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ విమాన ప్రమాదాలు చాలానే జరగగా, తాజాగా మరో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కొలంబియాలో ( Colombia) ఎయిర్ ఫోర్స్ విమానం ( Military plane) కుప్పకూలింది. సైనికులను తీసుకు వెళ్తుండగా పుటుమాయో ప్రావిన్స్ లో ఈ విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. లాండింగ్ అవుతున్న క్రమంలోనే సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ విమానం కుప్పకూలడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో విమానంలో ప్రయాణించిన 110 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రమాదం జరిగిన దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ పెడ్రో సాంచేజ్ ప్రకటన చేశారు. టేకాఫ్ సమయంలోనే విమానం కుప్పకూలినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రమాద సంఘటనలో చాలా మంది మృతి చెందారని.. వాళ్ల లెక్క ఇంకా తేలలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నట్లు వివరించారు.






