Bill Gates: AI ఎఫెక్ట్.. ఇక వారానికి రెండు రోజులే పని !

by velandi.Saikiran |   (  Updated:2025-04-01 03:05:58  IST  )

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) వినియోగంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Microsoft co-founder Bill Gates )

Bill Gates: AI ఎఫెక్ట్.. ఇక వారానికి రెండు రోజులే పని !
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) వినియోగంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Microsoft co-founder Bill Gates ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence ) కారణంగా... వారం రోజుల పని రెండు రోజుల్లోనే పూర్తవుతుందని... ఆయన బాంబు పేల్చారు. మరో 10 సంవత్సరాలలోపు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతుందన్నారు. తద్వారా.. వారం రోజుల పనిని రెండు రోజుల్లోనే ఇవి పూర్తి చేస్తాయని కూడా తెలిపారు. ఈ మార్పు రావడానికి పది సంవత్సరాలు పడుతుందని కూడా తెలిపారు బిల్ గేట్స్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కారణంగా ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని సోషల్ మీడియా, జాతీయ మీడియాలలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దీనిపై టెక్ నిపుణులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే.. ఉద్యోగుల కోత తప్పదని కూడా కొంతమంది చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల పనులను సులభతరం చేస్తుందని... వర్కింగ్ అవర్స్ కూడా తగ్గిస్తుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) టెక్నిక్ మార్కెట్లోకి రావడం మంచిదేనన్నారు. ఈ టెక్నాలజీ తో వారానికి రెండు రోజుల పని దినాల విధానం అందుబాటులోకి కూడా వస్తుందని సంచలన ప్రకటన చేశారు. దీనికి పది సంవత్సరాల సమయం పడుతుంది అని కూడా గుర్తు చేశారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Microsoft co-founder Bill Gates ).


Next Story