మెక్సికోలో కాల్పులు.. చిన్నారి సహా 10 మంది మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-18 04:37:29  IST  )

మెక్సికోలోని ఈస్ట్ సెంట్రల్ స్టేట్ అయిన పుయెబ్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. తెహుయిట్జింగో పట్టణంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు.

మెక్సికోలో కాల్పులు.. చిన్నారి సహా 10 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికోలోని ఈస్ట్ సెంట్రల్ స్టేట్ అయిన పుయెబ్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. తెహుయిట్జింగో పట్టణంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రజా భద్రతా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించినవారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ దారుణ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణ హత్యలకు పాల్పడిన నిందితులెవరు? దీనివెనుక ఉన్న కారణాలేంటి? అనే విషయాలపై స్థానిక అధికారులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కేసును ఫెడరల్ పరిశోధనా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. కొన్నినెలలుగా పుయోబ్లా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో హ్యుహుట్లాన్ ఎల్ గ్రాండేలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురవ్వగా.. కొద్దిరోజులకే పుయోబ్లా నగరంలో ఒక వాహనంపై జరిగిన సాయుధ దాడిలో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, తాజా విషాదంపై గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువతి దుర్మరణం

Next Story