IRAN-ISRAEL WAR: ఆ మిసైళ్ల పేర్లకు అర్థం ఏంటో తెలుసా?

by HARISH SP |   ( Updated:2024-10-04 01:30:38.0  )
IRAN-ISRAEL WAR: ఆ మిసైళ్ల పేర్లకు అర్థం ఏంటో తెలుసా?
X

చాలామంది పేరులో ఏమున్నది? అని కొట్టిపారేస్తుంటారు. కానీ, చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ పేరులో ఎంతో అర్థం ఉంటుంది. కొందరు దేవుడిపై భక్తితో తమ సంతానానికి పేర్లు పెట్టుకుంటే.. మరికొందరు తమ లక్ష్యానికి ప్రతీకగా పేర్లు పెట్టుకుంటారు. ప్రతి పేరుకు ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో వాడుతున్న మిసైళ్ల పేర్లు కొంత విచిత్రంగా ఉన్నా.. ఆ పేర్లకు ఉన్న అర్థాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇరాన్ వద్ద ఉన్న మిసైళ్లు వాటి పేర్లకు ఉన్న అర్థాలు చూద్దాం..

ఫతాహ్

ఇరాన్ లో అత్యంత ఫేవరెట్ మిసైల్ గా చెప్తారు. ఇది మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైల్. దీని అర్థం శుభారంభం, విజయం.

ఖొర్రం షహర్

ఈ మిసైల్ రేంజ్ 1000కిలోమీటర్ల నుంచి 2000 వరకు ఉంటుంది. ఈ పేరు వెనుక విషాద గాథ ఉన్నది. ఇరాక్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఈ పట్టణం పూర్తిగా నష్టపోయింది. ఎంతగా అంటే ఇరాక్ వేసిన క్షిపణులకు ఈ నగరంలో ఒక్కరు కూడా ఉండలేకపోయారు. 1986లో నిర్వహించిన జనాభా లెక్కల్లో ఈ పట్టణ జనాభా ‘సున్నా’గా నమోదు చేసుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత పట్టణ పునరుద్ధరణ జరగడంతో ప్రజలు తిరిగి వచ్చినా ఈ పట్టణం ఇరాన్ చరిత్రలో విషాదంగా మిగిలిపోయింది.

షాహబ్

ఈ సిరీస్ లో ఇరాన్ వద్ద ఏడు రకాల మిసైళ్లు ఉన్నాయి. ఇవి దాదాపు 3వేల వరకు ఆ దేశపు అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నట్టు అమెరికా నిఘా సంస్థ అనుమానం. ఇకపోతే షాహబ్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. తోకచుక్క, మేఘం, అరుణవర్ణం, నిప్పురవ్వ లాంటి అర్థాలు ఉన్నాయి. సాధారణంగా ఈ పేరును అబ్బాయిలకు పెడతారు.

జెల్ జల్

ఈ మిసైల్ రేంజ్ 1000 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్లు. ఇది లిక్విడ్ ప్రొపెల్లెంట్ తో పనిచేసే మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైల్. జెల్ జల్ అంటే పర్షియాలో భూకంపం అని అర్థం.

కౌసర్

ఐఆర్‌ఐఎస్ (ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్) ఆకాశం నుంచి ఆకాశంలోకి.. నేలనుంచి ఆకాశంలోకి పేల్చగల సామర్థం ఈ మిసైళ్ల సొంతం. లక్ష్యాన్ని కచ్చితంగా చేధించే ప్రత్యేక వ్యవస్థలు ఈ మిసైళ్లలో ఉంటాయి. ఇక కౌసర్ అనే పేరుకు అర్థం స్వర్గంలోని నది. అంటే ఈ మిసైల్ పేల్చితే శత్రువుకు మరణం తప్పదని అర్థం.

ఖైబర్ షెకాన్

ఈ మిసైల్ రేంజ్ 1400 కిలోమీటర్లు. ఈ మిసైల్ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ నాశనం చేసేందుకు నిర్దేశించినదిగా చెప్తారు. దీని పేరుకు కూడా చారిత్రక విశిష్టత ఉన్నది. ఖైబర్ అంటే యూదుల కోట. కొన్ని శతాబ్దాల కిందట అరబ్బులు యుద్ధం చేసి ఈ కోటను జయించారట. షెకాన్ అంటే వినాశనం. ఖైబర్ షెకాన్ అంటే యూదుల ప్రాంతాన్ని నాశనం చేసేదిగా అర్థం.

జుల్ఫికర్

అరబ్బుల విశ్వాసాల ప్రకారం జుల్ఫికర్ అనేది మహమ్మద్ ప్రవక్త వాడిన కత్తి పేరు. ఇది ప్రత్యేక వంపును కలిగి ఉండి.. శత్రువు వెన్నును రెండుగా చీల్చుతుందని అంటారు. అందుకే ఇరాన్ తన మధ్యశ్రేణి మిసైల్ కు ఈ పేరు పెట్టుకున్నది.

కియామ్

ఇది స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైల్. సాధారణంగా ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. అయితే, ప్రత్యేకంగా కొందరు ఆరోసారి కూడా ప్రార్థన చేస్తారు. సాయంకాలం ముగిసిన తర్వాత చేసే ప్రార్థనకు వేకువజామున చేసే ప్రార్థనకు మధ్యలో ఇది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రార్థన పేరు కియామ్. అందుకే ఇరాన్ ఈ మిసైల్ కు కియామ్ అని పేరు పెట్టుకున్నది.

Advertisement

Next Story