సముద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఒకే దగ్గర 400 ఓడలు!

by Bhoopathi Nagaiah |

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో సముద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సముద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఒకే దగ్గర 400 ఓడలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఇదే క్రమంలో సముద్రంలో వందలాది ఓడలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి దగ్గర ఓడలతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ నెటిజన్ విమానం విండో నుంచి తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ వారి దాడులను తిప్పికొడుతూనే అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచేందుకు తన ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎగుమతులు మొత్తం ఆగిపోయాయి. ముఖ్యంగా ఈ జలసంధి నుంచి ప్రపంచ దేశాలకు 20శాతం ఆయిల్, 20శాతం ఎల్ఎన్జీ రవాణా అవుతుంది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ హోర్ముజ్ జలసంధి నుంచి ఏ ఒక్క నౌకను వెళ్లనీయకపోవడంతో పర్షియన్ గల్ఫ్ సముద్రంలో సుమారు 300 నుంచి 400 భారీ రవాణా షిప్స్ నిలిచిపోయాయి.

హోర్ముజ్ జలసంధి నుంచి రోజుకు వంద నుంచి 150 ఓడలు వెళ్తుంటాయి. కానీ ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో గడిచిన నెల రోజుల నుంచి 100 నౌకలకు మించి ఈ మార్గం గుండా వెళ్లలేకపోయాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల నెల రోజులుగా 400 వరకు ఓడలు సముద్రంలోనే నిలిచిపోయాయి. వీటిల్లో 40 వేల మంది నావికులు సైతం చిక్కుకుపోయారు. తాజాగా విమానం విండో నుంచి ఓ ప్రయాణికుడు తీసిన ఫొటో సముద్రంలో ఏర్పడిన నౌకల ట్రాఫిక్‌ జామ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చిన్నచిన్న బొమ్మల్లా సముద్రంలో తేలియాడుతున్న భారీ నౌకలను ఫొటోలో చూడవచ్చు. వీటిని చూసిన నెటిజన్స్ భూమి, ఆకాశమే కాదు.. ఇప్పుడు సముద్రంలో కూడా టాఫ్రిక్ జామ్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story