దుబాయ్ ఎయిర్ పోర్టు స‌మీపంలో ఇరాన్‌ మిస్సైల్ దాడి

by velandi.Saikiran |

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇరాన్ భీకర మిస్సైల్ దాడి చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

దుబాయ్ ఎయిర్ పోర్టు స‌మీపంలో ఇరాన్‌ మిస్సైల్ దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్త‌ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ మరో దారుణానికి పాల్పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భయంకరమైన డ్రోన్ దాడికి ఇరాన్ పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రోన్ కారణంగా విమానాశ్రయానికి సమీపంలోనే భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఇంధన ట్యాంక్ పై డ్రోన్ పడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ ప్రమాద సంఘటన నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక విమానాలను అల్ మక్తుమ్ విమానాశ్రయానికి మళ్ళించారు. అయితే ఈ డ్రోన్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది.

Next Story