భారీ అగ్నిప్రమాదం.. నౌకలో దాదాపు 300 మంది ప్రయాణికులు!

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-20 13:47:19  IST  )

ఇండోనేషియా(Indonesia)లో ప్రయాణికులతో ఉన్న భారీ నౌక(Ship)లో అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.

భారీ అగ్నిప్రమాదం.. నౌకలో దాదాపు 300 మంది ప్రయాణికులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియా(Indonesia)లో ప్రయాణికులతో ఉన్న భారీ నౌక(Ship)లో అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని తలీసే ద్వీపానికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న కేఎం బార్సిలోనా వీఏ పాసింజర్ షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 300 ప్రయాణికులతో బయలుదేరిన ఆ షిప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం.. షిప్‌లో నుంచి సముద్రంలోని దూకేశారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు.. రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అందరినీ కాపాడినట్లు వార్తలు వినిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షిప్‌‌లో నుంచి ప్రజలు సముద్రంలోకి దూకడంపై నెటిజన్‌లు దిగ్భ్రాంతికి గురయ్యారు. టైటానిక్ షిప్ సినిమాలోని ప్రమాదం సీన్‌ల తలపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story