ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 10 మంది మృతి

by Malleboina Mahesh |

ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని భారీ భూకంపాలు కుదిపేస్తున్నాయి. నెలలో కనీసం రెండు భూకంపాలు సంభవిస్తూ పదులు సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 10 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) దేశాన్ని భారీ భూకంపాలు కుదిపేస్తున్నాయి. నెలలో కనీసం రెండు భూకంపాలు సంభవిస్తూ పదులు సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం (huge earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మజార్-ఈ-షరీఫ్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ భారీ భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో కనీసం 10 మంది మృతి చెందగా, 260 మందికి పైగా గాయపడ్డారు. Balkh, Samangan ప్రావిన్స్‌లలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తుంది.

టిప్పర్ లారీలు, వాహనాలు నాశనం కాగా, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంపం కారణంగా రహదారులు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్థానిక అధికారులు రక్షణ చర్యలను వేగవంతం చేశారు. నిపుణుల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతం కావడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలోనూ ఈ ప్రాంతంలో భారీ ప్రాణ నష్టం జరిగినట్లు గుర్తుచేశారు.

Next Story