బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.316 కోట్లు అపహరణ

by Naga Rani Yarlagadda |

ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. దుండగులు ఏకంగా రూ.316 కోట్లకు పైగా సొత్తును ఎత్తుకుపోయారు.

బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.316 కోట్లు అపహరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. దుండగులు ఏకంగా రూ.316 కోట్లకు పైగా సొత్తును ఎత్తుకుపోయారు. ఈ ఘటన జర్మనీలోని గెల్సెన్ కిర్చెన్ నగరంలో ఉన్న బ్యాంకులో జరిగింది. జర్మనీ నేర చరిత్రలోనే ఈ ఇది అతిపెద్ద దొంగతనమని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ దొంగతనంలో చాలామంది పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. బ్యాంకులో ఉన్న 3200 సేఫ్టీ డిపాజిట్లను పగలగొట్టిన దుండగులు.. వాటిలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ అక్కడి కరెన్సీలో 30 మిలియన్ యూరోలపైగా ఉంటుందని అంచనా వేశారు.

దుండగులు పార్కింగ గ్యారేజీ నుంచి లోపలికి ప్రవేశించి.. ఖజానా ఉన్న గది గోడకు భారీ రంధ్రం చేసి వెళ్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2500 మంది ఖాతాదారులకు చెందిన సొమ్ము దోపిడీకి గురైనట్లు సమచారం. విషయం తెలుసుకున్న వందలాదిమంది కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకుని తమ సొమ్మును తెచ్చివ్వాలని ఆందోళనకు దిగారు. పలువురు కస్టమర్లు బ్యాంకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.

Next Story